Share News

వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్

ABN , Publish Date - Jul 27 , 2026 | 10:32 AM

జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్‌ను భారత్‌కు క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్
VVS Laxman

స్పోర్ట్స్ డెస్క్: జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్‌ను భారత్‌కు క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ భవిష్యత్తు భారత్‌కు ఎంతో ఆశాజనకంగా ఉందని లక్ష్మణ్ తెలిపాడు. అయితే, అతడు ఫిట్‌నెస్‌పై మరింత శ్రమించాల్సి ఉందని పేర్కొన్నాడు. చివరి టీ20లో 49 బంతుల్లో 81 పరుగులు చేసిన వైభవ్.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను అందుకున్నాడు.


మూడో టీ20 అనంతరం మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'వైభవ్ ప్రతిభను బీసీసీఐ రెండున్నరేళ్ల(2024 అండర్-19 ప్రపంచకప్‌) క్రితమే గుర్తించింది. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఇండియా-బి తరఫున అతడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (సిఓఈ)లో జరిగిన వివిధ క్యాంపుల్లో పాల్గొన్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మెరిశాడు' అని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు.


'వైభవ్ మైదానంలో ఎలాంటి ఆటగాడో, వ్యక్తిగతంగా అతడి మనస్తత్వం ఏంటో మేనేజ్‌మెంట్‌కు పూర్తిగా తెలుసు. మ్యాచ్‌కు ముందు అతడిని ప్రశాంతంగా ఉంచేందుకు మేం ప్రయత్నిస్తాం. ప్రతిభ పరంగా అన్ని విభాగాల్లో రాణిస్తున్నప్పటికీ, అతడు తన ఫిట్‌నెస్‌ స్థాయిని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది. దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించాం' అని లక్ష్మణ్ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

'అనుభవమే అతిపెద్ద గుణపాఠం'.. ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ రజా వ్యాఖ్యలు!

అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యవంశీ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

Updated Date - Jul 27 , 2026 | 11:00 AM