Share News

పంజాబ్‌ విద్యామంత్రి కూడా రాజీనామా చేయాలి

ABN , Publish Date - Jul 27 , 2026 | 06:32 AM

నీట్‌ లీకేజీతో ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో పంజాబ్‌ విద్య, ఆరోగ్య శాఖల మంత్రులు కూడా రాజీనామా చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. పంజాబ్‌లో వివిధ పరీక్షల...

పంజాబ్‌ విద్యామంత్రి కూడా రాజీనామా చేయాలి

  • ఆప్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన ప్రతిపక్షాలు

చండీగఢ్‌, జూలై 26: నీట్‌ లీకేజీతో ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో పంజాబ్‌ విద్య, ఆరోగ్య శాఖల మంత్రులు కూడా రాజీనామా చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. పంజాబ్‌లో వివిధ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్‌ సింగ్‌ బైన్స్‌, ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌ సింగ్‌ రాజీనామా చేయాల్సిందేనంటూ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలు ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ) ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో పంజాబ్‌లో అనేక రిక్రూట్‌మెంట్‌, బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, పరీక్షల్లో అవకతవకల ఘటనలూ అనేకం వెలుగుచూశాయని ఆ పార్టీలు ఆరోపించాయి. అయితే, ఈ ఆరోపణలను సీఎం భగవంత్‌ మాన్‌ తోసిపుచ్చారు. ఆప్‌ ప్రభుత్వంలో ఏ ఒక్క పేపర్‌ కూడా లీక్‌ కాలేదన్నారు. ప్రశ్నపత్రాల లీక్‌కు, ‘మాస్‌ చీటింగ్‌’కు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 06:32 AM