Share News

'అనుభవమే అతిపెద్ద గుణపాఠం'.. ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ రజా వ్యాఖ్యలు!

ABN , Publish Date - Jul 27 , 2026 | 08:40 AM

భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో జింబాబ్వే కోల్పోయింది. హరారే వేదికగా నిన్న జరిగిన చివరి టీ20లో భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యచేధనలో జింబాబ్వే 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ పరాజయంపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా స్పందించాడు.

'అనుభవమే అతిపెద్ద గుణపాఠం'.. ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ రజా వ్యాఖ్యలు!
Zimbabwe captain Sikandar Raza

స్పోర్ట్స్ డెస్క్: భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో జింబాబ్వే కోల్పోయింది. హరారే వేదికగా నిన్న(ఆదివారం)జరిగిన చివరి టీ20లో భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యచేధనలో జింబాబ్వే 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ పరాజయంపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా స్పందించాడు. ఈ ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలు తమ జట్టు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని వ్యాఖ్యానించాడు. ప్రపంచ అత్యుత్తమ జట్లతో పోటీపడినప్పుడే చిన్న జట్ల మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గుతుందని, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఈ అనుభవం సాయపడుతుందని పేర్కొన్నాడు.


మ్యాచ్ అనంతరం రజా మాట్లాడుతూ.. 'మొదటగా ప్రపంచంలోనే అగ్ర శ్రేణి జట్టుతో ఆడే అవకాశం కల్పించిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. టాప్ టీమ్‌లతో ఆడితేనే ఏ దేశమైనా ఎదుగుతుంది. అన్ని జట్లు పోటీపడి ఆడినప్పుడే ప్రపంచ క్రికెట్ మరింత వినోదాత్మకంగా మారుతుంది. ఈ సిరీస్ ద్వారా మేము పొందిన అనుభవమే లభించిన అతిపెద్ద గుణపాఠం' అని తెలిపాడు.


ఈ సిరీస్‌లో న్యామ్‌హురి, మరుమాని, మధెవెరె వంటి యువ ఆటగాళ్లు ఆకట్టుకోవడం జట్టుకు సానుకూలాంశమని రజా సంతోషం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ సంస్కృతిలో తెచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ.. 'ప్రతి క్షణం పట్టుదలతో ఆడటం నేర్చుకున్నాం. అలానే జట్టులోని సహచరుల గెలుపోటముల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం మేం అలవర్చుకున్నాం. అంతర్జాతీయ క్రికెట్ గొప్ప జట్టుగా మారే క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా పర్వాలేదు. ఈ అనుభవంతో త్వరలోనే జింబాబ్వే బలంగా పుంజుకుంటుంది' అని ధీమా రజా వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి:

అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యవంశీ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

బంగారు చాను

Updated Date - Jul 27 , 2026 | 08:40 AM