Share News

విదేశీ యువతిపై అసభ్య ప్రవర్తన.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కేసు

ABN , Publish Date - Jul 27 , 2026 | 09:43 AM

హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో విదేశీ యువతి పట్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు మార్చి నెలలో భారత్‌కు వచ్చింది.

విదేశీ యువతిపై అసభ్య ప్రవర్తన.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కేసు
Hyderabad news

హైదరాబాద్, జులై 27: కొండాపూర్ ప్రాంతంలో విదేశీ యువతి పట్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు మార్చి నెలలో భారత్‌కు వచ్చింది. సదరు యువతి.. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నివసిస్తుండగా, అదే ఇంట్లో మరో యువకుడు ఆదిత్య ఆనంద్‌ ఉంటున్నాడు. అతడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్ ఇంట్లో లేని సమయంలో ఆదిత్య ఆనంద్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని నెదర్లాండ్స్‌ యువతి ఆరోపణలు చేసింది.


యువకుడి చేష్టలతో విసిగిపోయిన యువతి.. భారత్‌ నుంచి తిరిగి నెదర్లాండ్స్‌కు వెళ్లి అక్కడి ఎంబసీకి ఫిర్యాదు చేసింది. మూడు రోజుల క్రితం యువతి తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. జరిగిన విషయాలన్నింటినీ గచ్చిబౌలి పోలీసులకు వివరించింది. యువతి ఫిర్యాదు ఆధారంగా ఆదిత్య ఆనంద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడు. యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

క్షిపణుల కొరత వార్తలపై మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

పరీక్షా విధానంలో సంస్కరణలకు.. హైపవర్డ్‌ టాస్క్‌ఫోర్స్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2026 | 09:56 AM