Share News

బాయ్స్ హాస్టల్‌లోకి చొరబడ్డ మొసలి.. భయంతో పరుగులు పెట్టిన సిబ్బంది..

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:10 PM

బాయ్స్ హాస్టల్ మెస్‌లోకి మొసలి చొరబడ్డ ఘటన రాజస్థాన్‌లోని కోటలో చోటుచేసుకుంది. మొసలి మెస్‌లోకి వచ్చిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘర్ కే కాలేశ్ అనే వ్యక్తి ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు.

బాయ్స్ హాస్టల్‌లోకి చొరబడ్డ మొసలి.. భయంతో పరుగులు పెట్టిన సిబ్బంది..
Kota crocodile incident

ఇంటర్‌నెట్ డెస్క్: బాయ్స్ హాస్టల్ మెస్‌లోకి మొసలి చొరబడ్డ ఘటన రాజస్థాన్‌లోని కోటలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కోటలోని కోరల్ పార్క్‌లో ఓ బాయ్స్ హాస్టల్ ఉంది. 17వ తేదీ మధ్యాహ్నం వంటవాళ్లు మెస్‌లో వంట చేస్తుండగా మొసలి మెస్‌లోకి వచ్చింది. మొసలిని చూసి వారు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడినుంచి పరుగులు తీశారు. మెస్‌లోకి వచ్చిన మొసలి అక్కడే పడుకుండిపోయింది. విషయం తెలియగానే పెద్ద ఎత్తున స్థానిక జనం, హాస్టల్ విద్యార్థులు మెస్ దగ్గరకు చేరుకున్నారు.


కొంతమంది విద్యార్థులు ఆ మొసలిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ, వారి వల్ల కాలేదు. హాస్టల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలి పట్టుకుని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. హాస్టల్ పక్కనే ఉన్న మురుగు నీటి కాలువ నుంచి ఆ మొసలి పైకి వచ్చి ఉంటుందని, బేస్‌మెంట్‌లో ఉన్న మెస్‌లోకి ప్రవేశించి ఉంటుందని స్థానిక అధికారులు చెబుతున్నారు. మొసలి మెస్‌లోకి వచ్చిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘర్ కే కాలేశ్ అనే వ్యక్తి ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

‘హెల్తీ- వెల్తీ- హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా ముందుకు: మంత్రి అనగాని సత్యప్రసాద్

APAAR ఐడీ పూర్తి స్వచ్ఛందం.. నిరాకరిస్తే అడ్మిషన్లు ఆపొద్దు: సుప్రీంకోర్టు

Updated Date - Jul 20 , 2026 | 03:22 PM