Share News

దొంగతనం చేస్తూ పట్టుబడిన మహిళ.. బట్టలు విప్పేస్తా అంటూ బెదిరింపులు..

ABN , Publish Date - Jul 04 , 2026 | 07:34 AM

నగలు దొంగిలించేందుకు ఇంట్లోకి చొరబడిన ఓ మహిళ చివరకు అదే ఇంట్లో బందీ అయిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బయటపడేందుకు దారి కనిపించకపోవడంతో ఏకంగా ఇంటి యజమానినే బెదిరిస్తూ 'బట్టలు విప్పేస్తా.. పోలీసులకు ఫోన్ చేస్తా.. మీపై కేసు పెడతా' అంటూ హైడ్రామాకు తెరలేపింది.

దొంగతనం చేస్తూ పట్టుబడిన మహిళ.. బట్టలు విప్పేస్తా అంటూ బెదిరింపులు..

జైపూర్: నగలు దొంగిలించేందుకు ఇంట్లోకి చొరబడిన ఓ మహిళ చివరకు అదే ఇంట్లో బందీ అయిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బయటపడేందుకు దారి కనిపించకపోవడంతో ఏకంగా ఇంటి యజమానినే బెదిరిస్తూ.. 'బట్టలు విప్పేస్తా.. పోలీసులకు ఫోన్ చేస్తా.. మీపై కేసు పెడతా' అంటూ హైడ్రామాకు తెరలేపింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌లోని ముహానా ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో ఇటీవల నగలు, నగదు చోరీ అయ్యాయి. అప్రమత్తమైన యజమాని ఇంటి నలుమూలలా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. గురువారం కుటుంబంతో కలిసి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఓసారి ఇంటిని గమనించేందుకు మొబైల్‌లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాడు. అందులో కనిపించిన దృశ్యాలు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అల్మారాను తెరిచింది. అందులోని నగల పెట్టెను బయటకు తీసి బంగారు ఆభరణాలను పరిశీలిస్తున్నట్లు కనిపించింది. వెంటనే అప్రమత్తమైన యజమాని పక్కింటి వారికి ఫోన్ చేసి ఇంటి ప్రధాన గేటుకు తాళం వేయించాడు. అనంతరం హుటాహుటిన నివాసానికి చేరుకున్నాడు.


అప్పటికే బయటకు వెళ్లే మార్గం లేక మహిళ ఇంట్లోనే చిక్కుకుపోయింది. యజమానిని చూసి మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే బెదిరింపులకు దిగింది. 'నన్ను అడ్డుకుంటే బట్టలు విప్పేస్తా.. పోలీసులకు ఫోన్ చేసి మీపై కేసు పెడతా' అంటూ గట్టిగా కేకలు వేసింది. అయితే ఆమె బెదిరింపులకు భయపడని ఇంటి యజమాని.. ఘటన మొత్తాన్ని తన మొబైల్‌లో చిత్రీకరించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు ఆమెపై దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ మొత్తం ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

యూట్యూబర్ జోసెఫ్ రావణ్ మరోసారి అరెస్టు.. పాయకరావుపేటకు తరలింపు..

Updated Date - Jul 04 , 2026 | 07:49 AM