Share News

భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

ABN , Publish Date - Jul 04 , 2026 | 07:08 AM

భర్త కనబడడం లేదని 45 రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది.. చుట్టు పక్కల వారి దగ్గర రోజూ కన్నీళ్లు పెట్టుకునేది.. ఎంత ప్రయత్నించినా పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.. భార్య ప్రవర్తన మీద అనుమానం రావడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు..

భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..
Agra woman kills husband

భర్త కనబడడం లేదని 45 రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది.. చుట్టు పక్కల వారి దగ్గర రోజూ కన్నీళ్లు పెట్టుకునేది.. ఎంత ప్రయత్నించినా పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.. భార్య ప్రవర్తన మీద అనుమానం రావడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు.. చివరకు అసలు విషయం బయటపెట్టారు.. ఆమె ఇంట్లోని బాత్రూమ్ ఫ్లోర్ కింద భర్త మృతదేహాన్ని కనుగొన్నారు.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది (Agra woman kills husband).


ఆగ్రాకు చెందిన 44 ఏళ్ల సురేంద్ర శర్మ కనిపించడం లేదంటూ అతని భార్య రూబీ గతంలో ఫిర్యాదు చేసింది. అయితే దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఆమె వాంగ్మూలంలో పలు అనుమానాస్పద అంశాలు కనిపించడంతో పోలీసులు ఇంటిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. బాత్రూమ్ ఫ్లోర్‌పై కొత్తగా ప్లాస్టర్ చేసిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కార్మికుల సహాయంతో ఆ ఫ్లోరింగ్‌ను తొలగించారు. అనంతరం బాత్రూమ్ నేల కింద నుంచి సురేంద్ర శర్మ మృతదేహాన్ని వెలికితీశారు (Husband buried under bathroom).


భర్తను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బాత్రూమ్‌లో పూడ్చిపెట్టి, పైభాగాన్ని ప్లాస్టర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు (Shocking case India). ఈ కేసులో మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు, హత్యకు గల అసలు కారణం ఏమిటి? మృతదేహాన్ని దాచడంలో మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ వివరాల ఆధారంగా కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

Updated Date - Jul 04 , 2026 | 07:16 AM