భయం లేదు.. పశ్చాత్తాపం లేదు..!
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:24 AM
తన ప్రియుడితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ ప్రవర్తన తీరు...
మీడియాకు మధ్య వేలు చూపుతూ పుణె హత్య
కేసు నిందితురాలు సియా అసభ్యకర సైగలు..
న్యూఢిల్లీ, జూలై 3: తన ప్రియుడితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ ప్రవర్తన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. కేసు విచారణలో భాగంగా సియాను పోలీసులు ఇంటికి తీసుకొచ్చిన సమయంలో.. అక్కడ ఎదురుచూస్తున్న మీడియా ప్రతినిధులకు ఆమె మధ్య వేలు చూపి దురుసుగా ప్రవర్తించింది. అసభ్యకర సైగలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. సియా తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘చేసిన నేరానికి శిక్ష పడుతుందన్న భయం లేదు.. కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. అత్యంత దుర్మార్గురాలు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగపూర్-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్ కేబుల్
For More Business News And Telugu News