Share News

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 02:59 AM

భారత తూర్పు తీరం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు ఏఐ కనెక్టివిటీ మరింత వేగం పుంజుకోనుంది. సింగపూర్‌, మలేషియా, భారత తూర్పు తీరంలోని...

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

  • ఏర్పాటు చేయనున్న లైట్‌స్టార్మ్‌

  • హైదరాబాద్‌లోని డేటా కేంద్రాలకు బూస్ట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత తూర్పు తీరం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు ఏఐ కనెక్టివిటీ మరింత వేగం పుంజుకోనుంది. సింగపూర్‌, మలేషియా, భారత తూర్పు తీరంలోని మచిలీపట్నం, చెన్నైలను కలుపుతూ లైట్‌స్టార్మ్‌ అనే సంస్థ సముద్ర గర్భంలో అత్యాధునిక సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. మైక్రోసాఫ్ట్‌, సింగ్‌టెల్‌, టాటా కమ్యూనికేషన్స్‌ కంపెనీలతో ఇందుకోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు లైట్‌స్టార్మ్‌ తెలిపింది. ‘ఐ-2సీ’ పేరుతో పిలిచే ఈ 3,600 కిలోమీటర్ల సబ్‌సీ కేబుల్‌ ప్రాజెక్ట్‌ 2029 డిసెంబరు నాటికి పూర్తవుతుందని లైట్‌స్టార్మ్‌ గ్రూప్‌ సీఈఓ, ఎండీ అమజిత్‌ గుప్తా తెలిపారు. ఈ సబ్‌సీ కేబుల్‌తో హైదరాబాద్‌, చైన్నై నగరాల్లోని ఏఐ, హైపర్‌స్కేల్‌ డేటా కేంద్రాల మధ్య దూరం తగ్గి, ఏఐ కనెక్టివిటీ మరింతగా పెరగనుందని ఆయన తెలిపారు. ఈ కేబుల్‌ వ్యవస్థతో హైదరాబాద్‌, చెన్నైల్లోని హైపర్‌స్కేల్‌ ఏఐ కేంద్రాలకు సింగపూర్‌, మలేషియాల్లోని డేటా సెంటర్ల కారిడార్లతో ఇంటర్‌కనెక్టివిటీ ఏర్పడుతుంది. సింగపూర్‌, మలేషియా, హైదరాడాద్‌ కారిడార్‌లో అత్యంత వేగంగా డేటా ట్రాన్స్‌మిషన్‌ జరుగుతుందని గుప్తా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Updated Date - Jul 03 , 2026 | 02:59 AM