Share News

మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

ABN , Publish Date - Jul 02 , 2026 | 07:52 AM

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. టెల్ అవీవ్‌లోని పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తగిన బుద్ధి చెబుతామని ఆయన అమెరికాను హెచ్చరించారు.

మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
Araghchi

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. టెల్ అవీవ్‌లోని పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తగిన బుద్ధి చెబుతామని ఆయన అమెరికాను హెచ్చరించారు. ఇరాన్‌పై లేదా తమ దేశ నాయకత్వంపై ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెంటనే గట్టి ప్రతిస్పందన ఇస్తామని స్పష్టం చేశారు (Iran Israel News).


ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణ శిక్షకు అర్హుడని ఇటీవల ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ చేసిన వ్యాఖ్యలపై అరాగ్చీ స్పందించారు. 'పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందం ప్రకారం.. ఇజ్రాయెల్ చర్యలను అమెరికా నియంత్రించాలి. ఒకవేళ అమెరికా మాటలను వినకపోతే ఇజ్రాయెల్‌కు ఇరానే తగిన బుద్ధి చెబుతుంది' అని అరాగ్చీ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు (Iran Warns Israel).


ప్రస్తుతం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఖతార్ రాజధాని దోహాలో దౌత్య చర్చలు కొనసాగిస్తున్నారు (US Iran). ప్రధానంగా హోర్ముజ్ జలసంధి భద్రత, కాల్పుల విరమణ కొనసాగింపు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఖతార్, పాకిస్థాన్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

Updated Date - Jul 02 , 2026 | 09:13 AM