Share News

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

ABN , Publish Date - Jul 01 , 2026 | 04:02 PM

కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిషేధాన్ని కేసీఏ ఎత్తివేసింది.

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్
Sreesanth

ఇంటర్నెట్ డెస్క్: కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిషేధాన్ని కేసీఏ ఎత్తివేసింది. అతడు బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శ్రీశాంత్‌ను హెచ్చరించింది.


గతంలో కేసీఏ ప్రతిష్ఠకు భంగం కలిగించే శ్రీశాంత్ వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై కేసీఏ మూడేళ్ల నిషేధం విధించింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శ్రీశాంత్ తిరువనంతపురం మున్సిఫ్ కోర్టును ఆశ్రయించాడు. కానీ కోర్టు అతడి పిటిషన్‌ను కొట్టేసింది. ఆ తర్వాత శ్రీశాంత్ కేసీఏకు అధికారికంగా క్షమాపణ చెప్పాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి విచారం వ్యక్తం చేశాడు. దీనిపై నేడు(బుధవారం) కేసీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చర్చించి.. అతడిపై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించారు. దీంతో కేరళ క్రికెట్ లీగ్ (కేసీఎల్) మూడో సీజన్‌లో ఏరీస్ కొల్లం సెయిలర్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా శ్రీశాంత్ కొనసాగేందుకు మార్గం సుగమమైంది.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో ఇషాన్ కిషన్

ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి

Updated Date - Jul 01 , 2026 | 04:02 PM