ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Jul 01 , 2026 | 02:40 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం మెక్సికో రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. దీంతో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలు విషాదంగా మారాయి. బుధవారం జరిగిన ఈ సంబరాల్లో ఊపిరాడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం మెక్సికో రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. 2-0తేడాతో ఈక్వెడార్‌ను చిత్తు చేసింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌లో నాకౌట్ దశను దాటింది. దీంతో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలు విషాదంగా మారాయి. బుధవారం జరిగిన ఈ సంబరాల్లో ఊపిరాడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మెక్సికో ప్రభుత్వం ధ్రువీకరించింది.
మృతుల్లో 19 ఏళ్ల యువతి, 44 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. అభిమానులు భారీ ఎత్తున సంబరాల్లో పాల్గొనడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు నెట్టేసుకోవడంతో ఊపిరాడక ఆ ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా మృతిచెందినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఈ విషయాన్ని అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఘటనలో చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్
40 ఏళ్ల నాకౌట్ శాపానికి తెర.. ఈక్వెడార్‌ను చిత్తు చేసిన మెక్సికో