Share News

వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:25 PM

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం కొనసాగుతోంది. ఆ సిరీస్‌లో వైభవ్‌ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే..

వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌
Shreyas Iyer

స్పోర్ట్స్ డెస్క్: వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం కొనసాగుతోంది. ఆ సిరీస్‌లో వైభవ్‌ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతడికి తుదిజట్టులో చోటు దక్కలేదు. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌, హెచ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంలోకి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎంట్రీ ఇచ్చి... వైభవ్‌ను ఐర్లాండ్‌ సిరీస్‌లో ఆడించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రేయస్‌ అయ్యర్‌, గౌతమ్‌ గంభీర్‌‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు.


గిరిరాజ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత జట్టు టీ20 కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తాజాగా స్పందించాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. తాను సోషల్ మీడియా లేదా న్యూస్ ఛానల్స్‌ నుంచి వచ్చే ఒత్తిడిని పట్టించుకోనని అన్నాడు. జట్టు అవసరాలు, ప్రదర్శన ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నాడు. దీంతో వైభవ్‌ అరంగేట్రంపై వస్తున్న రాజకీయ ఒత్తిడిని, వ్యాఖ్యలను శ్రేయస్ అయ్యర్ నేరుగానే తిప్పికొట్టాడని క్రీడా నిపుణులు అంటున్నారు.


మరోవైపు ఇవాళ ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20లోనూ వైభవ్‌ అరంగేట్రం చేయడని టాక్ వినిపిస్తోంది. భారత మేనేజ్‌మెంట్‌, కోచ్‌, కెప్టెన్‌ అందరూ ముక్తకంఠంతో ఓపెనర్లుగా అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌కు వత్తాసు పలుకుతున్నారని సమాచారం. దీన్ని బట్టి ఇవాళ్టి మ్యాచ్‌లోనూ వైభవ్‌ అరంగేట్రం లేనట్లేనని తెలుస్తోంది. దీంతో మరోసారి టీమిండియా అభిమానులు సైతం అసంతృప్తిగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

40 ఏళ్ల నాకౌట్ శాపానికి తెర.. ఈక్వెడార్‌ను చిత్తు చేసిన మెక్సికో

రికార్డులపై అభిషేక్ శర్మ కన్ను.. రోహిత్ మార్క్‌ను దాటేసేందుకు లక్కీ ఛాన్స్!

Updated Date - Jul 01 , 2026 | 12:55 PM