బైక్ దొంగతనాల ముఠా అరెస్ట్.. 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:27 AM
హైదరాబాద్‌లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పాత నేరస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్, జులై 1: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పాత నేరస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ నాగేశ్వరరావు తెలిపారు. శివరాంపల్లి పిల్లర్ నంబర్ 295 వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ దొంగతనంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగలను అత్తాపూర్ పోలీసులు గుర్తించారు.
అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్ షానవాజ్, మహమ్మద్ మొయిజ్ మోహియుద్దీన్ ఉన్నారు. పరారీలో ఉన్న శాస్త్రీపురానికి చెందిన నూర్, ఫర్హాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా జల్సాలు, చెడు వ్యసనాల కోసమే బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న వాటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్, సుజుకి బర్గ్‌మన్, యాక్టివా వాహనాలు ఉన్నాయి. అరెస్ట్ అయిన వారు గతంలోనూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లను పంపిణీ చేసిన హోం మంత్రి అనిత
బీదర్ చెత్త వివాదం.. నిలిచిన రాకపోకలు
Read Latest Telangana News And Telugu News