బీదర్ చెత్త వివాదం.. నిలిచిన రాకపోకలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 10:29 AM
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ మున్సిపాలిటీ నుంచి తరలిస్తున్న చెత్తను తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్తులు గత 15 రోజులుగా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.
సంగారెడ్డి, జులై 1: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ మున్సిపాలిటీ నుంచి తరలిస్తున్న చెత్తను తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్తులు గత 15 రోజులుగా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. బీదర్ మున్సిపల్ డంపింగ్ యార్డును తమ గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డు కారణంగా పరిసర ప్రాంతాల్లో గాలి, నీటి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్తులు వాపోయారు. దీనిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపించారు. దీంతో బీదర్ నుంచి వచ్చే చెత్త వాహనాలను గ్రామ సరిహద్దులోనే మల్గి గ్రామ ప్రజలు అడ్డుకుంటూ నిరసన తెలుపుతున్నారు.
బీదర్ మున్సిపల్ అధికారుల వైఖరిపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెత్త వాహనాలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ‘మీరు బీదర్‌కు ఎలా వస్తారో చూస్తాం’ అంటూ మల్గి-బీదర్ ప్రధాన రహదారిపై సుమారు 40 వాహనాల చెత్తను పారబోసినట్లు స్థానికులు చెబుతున్నారు. రహదారి మొత్తం చెత్తతో నిండిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బీదర్-మల్గి మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి...
క్రిప్టోతో భారీ ఆదాయం.. గతేడాది ట్రంప్ సంపాదన రూ.11 వేల కోట్లకు పైనే..!
ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లను పంపిణీ చేసిన హోం మంత్రి అనిత
Read Latest Telangana News And Telugu News