Share News

అకారణంగా నన్ను సాయికృష్ణ కేసులో ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు: నాగరాజు

ABN , Publish Date - Jul 01 , 2026 | 10:01 AM

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరైన సస్పెండెడ్ సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అకారణంగా నన్ను సాయికృష్ణ కేసులో ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు: నాగరాజు
Sai Krishna Case

విజయవాడ, జులై 1 (ఆంధ్రజ్యోతి): ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో (Sai Krishna Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరైన సస్పెండెడ్ సీఐ నాగరాజు (Nagaraju) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేసును ఒప్పుకునేలా ఒత్తిడి తెస్తున్నారని, అకారణంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.


ఈ కేసులో తనను బలవంతంగా నిందితుడిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నిర్వహించిన విచారణలో పూర్తిగా సహకరించానని, తన వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని ఇప్పటికే అధికారులకు అందించానని తెలిపారు. ప్రస్తుతం తన వద్ద అదనంగా చెప్పేందుకు ఎలాంటి సమాచారం లేదని నాగరాజు పేర్కొన్నారు.


అంతేకాకుండా, కస్టడీలో తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా నాగరాజు న్యాయమూర్తికి వివరించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన న్యాయమూర్తి, నాగరాజు చేసిన ఆరోపణలు, అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.

మరోవైపు, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే నాగరాజును 12 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 01 , 2026 | 12:14 PM