Share News

ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లను పంపిణీ చేసిన హోం మంత్రి అనిత

ABN , Publish Date - Jul 01 , 2026 | 10:02 AM

అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన కొనసాగుతోంది. పాయకరావుపేట పట్టణంలోని పాత పెద్దిరెడ్డి వారి వీధిలో పెన్షన్లను పంపిణీ చేశారు.

ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లను పంపిణీ చేసిన హోం మంత్రి అనిత
Home Minister Anitha

అనకాపల్లి జిల్లా, జులై 1: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు మంత్రులు, అధికారులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పాత పెద్దిరెడ్డి వారి వీధిలో హోం మంత్రి అనిత పెన్షన్లను పంపిణీ చేశారు. వర్షంలో కూడా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాయకరావుపేట వార్డుల్లో పర్యటించిన అనిత.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


మామిడిపండ్లు అమ్మే పైడమ్మతో హోం మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. ఆపై ఆమె వద్ద పండ్లను కొనుగోలు చేశారు. పాయకరావుపేటలో రోడ్డుపక్కన టిఫిన్ షాపు నిర్వాహకురాలిని పలకరించారు. అక్కడే స్థానిక నాయకులతో కలిసి అనిత గారెలు తిన్నారు. అనంతరం పాయకరావుపేట PHCలో నూతన భవనాన్ని హోం మంత్రి అనిత ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి...

గాదె సాయికృష్ణ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

క్రిప్టోతో భారీ ఆదాయం.. గతేడాది ట్రంప్ సంపాదన రూ.11 వేల కోట్లకు పైనే..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 01 , 2026 | 10:13 AM