Share News

క్రిప్టోతో భారీ ఆదాయం.. గతేడాది ట్రంప్ సంపాదన రూ.11 వేల కోట్లకు పైనే..!

ABN , Publish Date - Jul 01 , 2026 | 08:57 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదాయం గతేడాది విపరీతంగా పెరిగింది. 2025లో తన క్రిప్టోకరెన్సీ వ్యాపారాల ద్వారా ట్రంప్ సుమారు 1.2 బిలియన్ డాలర్ల (రూ.11 వేల కోట్లకు పైగా) ఆదాయం పొందినట్లు తాజాగా విడుదలైన ఆర్థిక వివరాలు వెల్లడించాయి.

క్రిప్టోతో భారీ ఆదాయం.. గతేడాది ట్రంప్ సంపాదన రూ.11 వేల కోట్లకు పైనే..!
Trump crypto income

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదాయం గతేడాది విపరీతంగా పెరిగింది. 2025లో తన క్రిప్టోకరెన్సీ వ్యాపారాల ద్వారా ట్రంప్ సుమారు 1.2 బిలియన్ డాలర్ల (రూ.11 వేల కోట్లకు పైగా) ఆదాయం పొందినట్లు తాజాగా విడుదలైన ఆర్థిక వివరాలు వెల్లడించాయి. దీంతో సాంప్రదాయ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కంటే క్రిప్టో వ్యాపారాలే ట్రంప్ కుటుంబానికి అత్యధిక ఆదాయ వనరుగా మారినట్లు తెలుస్తోంది (Trump crypto income).


1978 నాటి ఒక చట్టం ప్రకారం, అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తమ ఆస్తులతో పాటు ఆదాయాన్ని కూడా ప్రకటించాల్సి ఉంటుంది. మంగళవారం ట్రంప్ ఆస్తులకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ట్రంప్‌నకు చెందిన స్టార్టప్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌ ద్వారా దాదాపు 550 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. క్రిప్టో వ్యాపారాలతో పాటు విదేశీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, లైసెన్సింగ్ ఒప్పందాలు, ట్రంప్ బ్రాండ్ ఉత్పత్తులు, గోల్ఫ్ రిసార్టులు కూడా గణనీయమైన ఆదాయాన్ని అందించాయి (Donald Trump Wealth).


ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతర్, వియత్నాం, రొమేనియా వంటి దేశాల్లోని ప్రాజెక్టుల ద్వారా కూడా ట్రంప్ కుటుంబానికి భారీ ఆదాయం సమకూరింది (Trump financial disclosure). కాగా, ట్రంప్ క్రిప్టో వ్యాపారాలపై ఎప్పట్నుంచో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్రిప్టో రంగానికి అనుకూల విధానాలు అమలు చేయడం, అదే సమయంలో ఆయన కుటుంబ వ్యాపారాలు భారీగా లాభపడడంపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

భారత్ క్లిష్టమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది.. చుట్టూ కఠినమైన దేశాలు: అమెరికా రాయబారి


మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 01 , 2026 | 10:00 AM