Share News

భారత్ క్లిష్టమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది.. చుట్టూ కఠినమైన దేశాలు: అమెరికా రాయబారి

ABN , Publish Date - Jul 01 , 2026 | 07:18 AM

భారత్ భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో ఉందని, చుట్టూ ఉన్న కొన్ని పొరుగు దేశాలు సవాళ్లు విసురుతున్నాయని అమెరికా రాయబారి సెర్జియో గోర్ వ్యాఖ్యానించారు.

భారత్ క్లిష్టమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది.. చుట్టూ కఠినమైన దేశాలు: అమెరికా రాయబారి
Sergio Gor

భారత్ భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో ఉందని, చుట్టూ ఉన్న కొన్ని పొరుగు దేశాలు సవాళ్లు విసురుతున్నాయని అమెరికా రాయబారి సెర్జియో గోర్ (Sergio Gor) వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ లీడర్‌షిప్ సమ్మిట్-2026లో పాల్గొన్న సెర్జియో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


'భారత్‌కు పొరుగున కొన్ని కరుకు దేశాలు ఉన్నాయి. వాటిలో ఏదైనా దేశం ఆగ్రహంతో నిద్ర లేస్తే ఆ ప్రాంతంలో పరిస్థితులు మారిపోతాయి. ఈ నేపథ్యంలో భారత్ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది' అని గోర్ పేర్కొన్నారు. ఇక, భారత్-అమెరికా భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత విస్తరించనుందని గోర్ చెప్పారు. రక్షణ, సాంకేతికత, వాణిజ్యం, ఇంధనం, వ్యూహాత్మక భద్రత వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన వివరించారు (India US relations).


ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కూడా తుది దశకు చేరుకుందని (India tough neighbours), మిగిలిన కొద్ది అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత కీలకమవుతోందని గోర్ పేర్కొన్నారు. ప్రపంచ స్థిరత్వం, ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, ఆర్థిక సహకారం వంటి అంశాల్లో రెండు దేశాలు కలిసి ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్‌: తుమ్మల

హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!

Updated Date - Jul 01 , 2026 | 07:18 AM