Share News

వాట్సాప్‌లోనూ యూజర్‌నేమ్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:39 AM

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం తదితర సోషల్‌ మీడియా వేదికల్లో ఉన్నట్లుగానే వాట్సాప్‌లోనూ యూజర్‌నేమ్‌ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనిద్వారా ఫోన్‌ నెంబరును వెల్లడించకుండానే...

వాట్సాప్‌లోనూ యూజర్‌నేమ్‌

  • ఫోన్‌ నంబరును వెల్లడించకుండానే చాటింగ్‌

  • యూజర్ల గోప్యతను మరింత పెంచడంలో భాగంగా కొత్త ఫీచర్‌: మెటా

  • ఈ ఏడాది చివరికి అందుబాటులోకి

  • దశలవారీగా యూజర్‌ నేమ్‌ల రిజర్వు ప్రక్రియ

  • ఫోన్‌ నంబరును వెల్లడించకుండానే చాటింగ్‌.. యూజర్ల గోప్యత కోసమే

  • ఈ ఏడాది చివరికి అందుబాటులోకి

న్యూఢిల్లీ, జూన్‌ 30: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం తదితర సోషల్‌ మీడియా వేదికల్లో ఉన్నట్లుగానే వాట్సాప్‌లోనూ యూజర్‌నేమ్‌ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనిద్వారా ఫోన్‌ నెంబరును వెల్లడించకుండానే అవతలి వ్యక్తులకు మెసేజీ పంపించటం, చాటింగ్‌ జరపటం వంటివి చేయవచ్చు. ఈ మేరకు వాట్సప్‌ యాజమాన్య సంస్థ మెటా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్‌ వ్యక్తుల గోప్యతను మరింత కాపాడుతుందని, కొత్త వ్యక్తులకు మెసేజీలు పంపించాల్సి వచ్చినప్పుడు, వాట్సాప్‌ గ్రూప్‌లలో జరిగే చర్చల్లో పాల్గొనేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ ఏడాది చివరికి వాట్స్‌పలో యూజర్‌ నేమ్‌ ఫీచర్‌ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు యూజర్‌నేమ్స్‌లో తమకు నచ్చినదానిని ఎంచుకునే అవకాశాన్ని ఖాతాదారులకు కల్పించటానికి మెటా కసరత్తు ప్రారంభించింది. ‘వాట్సాప్‌లో ప్రస్తుతం 300 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నారు. ఇంత భారీసంఖ్య కారణంగా.. పేర్లు కలిసిపోయే అవకాశం ఉంది. అందుకనే యూజర్‌నేమ్స్‌తో కూడిన రిజర్వేషన్స్‌ని ఒపెన్‌ చేస్తున్నాం. వాటిలోంచి ఎవరికివారు నచ్చినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు’ అని మెటా వెల్లడించింది. మరోవైపు కంటెంట్‌ క్రియేటర్లు, కంపెనీలు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవాళ్లు తమ తమ ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ అకౌంట్లలో ఉన్న యూజర్‌నేమ్‌నే వాట్స్‌పలో కూడా వాడుకునే అవకాశం కల్పించనున్నట్లు మెటా తెలిపింది. ఇక యూజర్‌నేమ్‌ల డైరెక్టరీ వంటిదిగానీ, దానిని సెర్చ్‌చేసే ఆప్షన్‌గానీ ఉండబోదని, యూజర్ల గోప్యతను కాపాడటం కోసమే దీనిని ప్రవేశపెట్టటం లేదని పేర్కొంది. యూజర్‌నేమ్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరితోనైనా వాట్సా్‌పలో చాటింగ్‌ జరపాలంటే వారికి యూజర్‌నేమ్‌ను షేర్‌ చేస్తే సరిపోతుంది. అయితే, వాట్సప్‌ అకౌంట్‌ను ప్రారంభించాలంటే మాత్రం ఫోన్‌ నెంబరు ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి

ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్‌: తుమ్మల

హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!

Updated Date - Jul 01 , 2026 | 06:39 AM