Share News

న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. రీఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్!

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:18 PM

వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇవాళ తమ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన కివీస్ స్టార్ పేసర్ జాకబ్ డఫీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.

న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. రీఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్!
New Zealand ODI squad

స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇవాళ (బుధవారం) తమ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన కివీస్ స్టార్ పేసర్, ఆర్సీబీ కీలక ప్లేయర్ జాకబ్ డఫీ(ఐపీఎల్ 2026) మళ్లీ జట్టులోకి వచ్చాడు.


ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా ఉంటూ, ప్రతిష్ఠాత్మక 'సర్ రిచర్డ్ హాడ్లీ మెడల్' విన్నర్ అయిన డఫీ రాకతో ఆ జట్టు బౌలింగ్ బలం పుంజుకుంది. టీ20 ప్రపంచకప్2026 ఫైనల్ తర్వాత డఫీ మళ్లీ బ్లాక్ క్యాప్స్ జెర్సీని ధరించబోతున్నాడు. అతనితో పాటు 26 ఏళ్ల మాట్ ఫిషర్ కూడా పేస్ విభాగానికి ఎంపికయ్యాడు. ఇంగ్లండ్‌పై 2-1తేడాతో టెస్ట్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన నాథన్ స్మిత్‌(16 వికెట్లు)తో పాటు బెన్ సియర్స్ ఈ వన్డే సిరీస్‌కూ ఎంపికయ్యారు.


అయితే, పనిభారం కారణంతో సీనియర్ బౌలర్లు కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, విల్ ఒరుర్కేలకు బోర్డు విశ్రాంతినిచ్చింది. అలాగే చీలమండ సర్జరీ కారణంగా బ్లెయిర్ టిక్నర్ జట్టుకు దూరం కాగా.. రెండోసారి తండ్రైన డెవాన్ కాన్వేకు కుటుంబంతో గడిపేందుకు విశ్రాంతి ఇచ్చారు. మరో స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర 'మేజర్ లీగ్ క్రికెట్' (MLC) ఆడటానికి బోర్డు అనుమతించింది. ఈ సిరీస్‌కు మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.


న్యూజిలాండ్ వన్డే జట్టు:

మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, క్రిస్టియన్ క్లార్క్, జేకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే, నిక్ కెల్లీ, టామ్ లాథమ్, జైడెన్ లెనాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విల్ యంగ్.


ఇవి కూడా చదవండి:

వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌

40 ఏళ్ల నాకౌట్ శాపానికి తెర.. ఈక్వెడార్‌ను చిత్తు చేసిన మెక్సికో

Updated Date - Jul 01 , 2026 | 01:22 PM