Share News

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:43 PM

జీఎస్‌టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించిన స్థూల, నికర జీఎస్‌టీ వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం
GST collections June 2026

న్యూఢిల్లీ, జులై 1: జీఎస్‌టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించిన స్థూల, నికర జీఎస్‌టీ వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జూన్ నెలలో తెలంగాణలో రూ.5,050 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రం 11 శాతం వృద్ధి సాధించింది. జీఎస్‌టీ సెటిల్‌మెంట్ అనంతరం టీజీకి ఎస్జీఎస్‌టీ(SGST) కింద రూ. 3,994 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్- జూన్)లో మొత్తంగా తెలంగాణ 10.2 శాతం జీఎస్‌టీ వృద్ధి రేటు సాధించింది.


ఆంధ్రప్రదేశ్‌‌లో జూన్ నెలలో రూ.3,548 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రం 5 శాతం వృద్ధి సాధించింది. జీఎస్‌టీ సెటిల్‌మెంట్ అనంతరం రాష్ట్రానికి పోస్ట్-సెటిల్‌మెంట్ ఎస్జీఎస్‌టీ(SGST) కింద రూ.3,144 కోట్ల ఆదాయం లభించింది. ఏపీకి జీఎస్‌టీ సెటిల్‌మెంట్ కలిసివచ్చింది. దీని ద్వారా పోస్ట్-సెటిల్‌మెంట్ ఆదాయంలో రాష్ట్రం 21 శాతం వృద్ధి సాధించింది. ప్రస్తుతం జూన్ వరకు ముగిసిన మొదటి త్రైమాసికంలో ఏపీ మొత్తం జీఎస్‌టీ వృద్ధి రేటు 5.2 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా జూన్ నెలలో మొత్తం గ్రాస్ జీఎస్‌టీ వసూళ్లు రూ. 1,94,812 కోట్లుగా నమోదు అయ్యింది. గత ఏడాది కంటే 13.9 శాతం వృద్ధి నమోదైంది.


ఇవి కూడా చదవండి...

దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్

కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల

Read Latest AP News And Telangana News And National News Telugu News

Updated Date - Jul 01 , 2026 | 01:49 PM