Share News

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏమైందంటే.?

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:00 PM

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏమైందంటే.?
Nampally Fire Accident

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం (Nampally Fire Accident) చోటుచేసుకుంది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది.


సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకోవడంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ, ఎవరినీ ల్యాబ్ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.


కాగా.. ఉదయం 10:00 గంటల ప్రాంతంలో మొదటి ఫ్లోర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఫ్లోర్‌లోని కంప్యూటర్లు, ఫోరెన్సిక్ సంబంధిత కెమికల్స్‌తో సహా కీలకమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో పలు ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ మంటల్లో ఫోన్ ట్యాపింగ్‌కు కేసుకు సంబంధించిన హార్డ్ డిస్కులూ కాలిపోయినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 01:02 PM