Share News

వైసీపీకి బిగ్ షాక్.. గంజాయి కేసులో ఎంపీటీసీ అరెస్ట్..

ABN , Publish Date - Feb 20 , 2026 | 04:24 PM

గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీ నగేశ్ బాబుని కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు ఇవాళ (శుక్రవారం) అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన ఎంపీటీసీ చెల్లూరి నగేశ్‌బాబును అరెస్ట్ చేశారు..

వైసీపీకి బిగ్ షాక్.. గంజాయి కేసులో ఎంపీటీసీ అరెస్ట్..
YSRCP MPTC Nagesh Babu

కాకినాడ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీ నగేశ్ బాబుని (YSRCP MPTC Nagesh Babu) కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు ఇవాళ (శుక్రవారం) అరెస్ట్ చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన ఎంపీటీసీ చెల్లూరి నగేశ్‌బాబును అరెస్ట్ చేశారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అతను పరారీలో ఉన్నాడు.


220 కేజీల గంజాయిని కారులో తరలిస్తుండగా గతేడాది సెప్టెంబర్‌‌లో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో ఏ8గా ఎంపీటీసీ నగేశ్‌బాబు ఉన్నారు. ఆ తర్వాత అతను పరారయ్యాడు. ఈరోజు ఎట్టకేలకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడికి.. నిందితుడు ఎంపీటీసీ నగేశ్‌బాబు అనుచరుడి అని ప్రచారం జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 05:34 PM