Share News

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

ABN , Publish Date - Feb 19 , 2026 | 09:30 PM

33 ఏళ్లుగా ప్రతి ఇంటికీ తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకూ సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యమని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. రైతుల సాధికారత, పారదర్శకత కోసం తమ సంస్థ పనిచేస్తోందని స్పష్టం చేశారు..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): 33 ఏళ్లుగా ప్రతి ఇంటికీ తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకూ సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యమని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. రైతుల సాధికారత, పారదర్శకత కోసం తమ సంస్థ పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం(ఎక్స్)‌లో నారా భువనేశ్వరి ట్వీట్ పెట్టారు.


రూ.4 కోట్ల సంస్థగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా.. నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. అన్ని ఉత్పత్తులూ 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే.. మీ ఇంటికి చేరుతున్నాయని చెప్పారు. 500కి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో తాము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నామని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే — చూసిందే నమ్మండని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..

నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 09:39 PM