Share News

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..

ABN , Publish Date - Feb 19 , 2026 | 02:52 PM

ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితులుగా అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ఇతరులు ఉన్న విషయం తెలిసిందే..

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..
Alla Ramakrishna Reddy

విజయవాడ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి (Alla Ramakrishna Reddy) ఏసీబీ కోర్టు ఇవాళ (గురువారం) నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితులుగా.. అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ తదితరులు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు మూసివేస్తున్నట్లు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా.. కేసులో ఫిర్యాదుదారుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ కేసులో ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలపాలని నోటీసుల్లో ఏసీబీ కోర్టు తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 05:12 PM