Share News

IndiGo Crisis: ఇండిగోకు డీజీసీఏ షాక్​.. 5 శాతం విమానాల సంఖ్య తగ్గింపు!

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:55 PM

దేశ విమానయాన రంగంలో సంక్షోభం సృష్టించిన ఇండిగో వ్యవహారంపై డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో విమానాల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

IndiGo Crisis: ఇండిగోకు డీజీసీఏ షాక్​.. 5 శాతం విమానాల సంఖ్య తగ్గింపు!
IndiGo Crisis

ఢిల్లీ, డిసెంబర్ 09: భారత దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్. 20 సంవత్సరాల చరిత్రలో ఇండిగో మంచి పేరు సంపాదించినా.. డిసెంబర్ 2 నుంచి తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎక్కువ సంఖ్యలో విమాన షెడ్యూల్స్ కారణంగా సకాలంలో సేవలు అందించలేక ఇబ్బందులు పడుతుంది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో వింటర్ షెడ్యూల్ లో కొన్ని విమాన స్లాట్స్ ని తగ్గించి.. వాటి ప్లేస్ లో ఇతర ఎయిర్ లైన్స్ ని కేటాయిస్తున్నట్లు కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగోకి షాక్ ఇచ్చింది. ఇండిగో విమాన షెడ్యూల్ ను 5 శాతం తగ్గించినట్లు ప్రకటించింది. ఇండిగో రోజుకు దాదాపు 2,200 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతుంది.


DGCA ఉత్తర్వుల ప్రకారం రోజుకు 110 విమానాల సర్వీస్ తగ్గించినట్లవుతుంది. బుధవారం సాయంత్రం వరకు సవరించిన షెడ్యూల్ ని DGCAకి సమర్పించాలని ఇండిగోను ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల ఇండిగోలో ఏర్పడిన సంక్షేమం దృష్ట్యా మంగళవారం నాడు రాజీవ్ భవన్ లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండిగో తీసుకుంటున్న నిర్ణయాలు.. రీఫండ్, కస్టమర్ కేర్ ఇతర అంశాలపై చర్చించారు. భవిష్యత్ లో ఇలాంటి సంక్షోభం పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది.


ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. చెప్పిన కొన్ని రోజులకే.. డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఇండిగో విమానాల సంఖ్యను 5 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే పది మంది అధికారులను వివిధ విమానాశ్రయాల్లో పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశారు. వారు రెండు మూడు రోజులు అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ప్రయాణికులను ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పరిస్థితులను చక్కబెట్టాలని మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Amit Shah: జాతీయగీతం బెంగాల్‌కు పరిమితం కాదు.. ప్రియాంకకు అమిత్‌షా కౌంటర్

Goa Nightclub Fire: లూథ్రా బ్రదర్స్‌ కోసం వేట.. ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసు

Updated Date - Dec 09 , 2025 | 05:19 PM