Goa Nightclub Fire: లూథ్రా బ్రదర్స్ కోసం వేట.. ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసు
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:39 PM
శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు టూరిస్టులతో సహా పలువురు అగ్నిప్రమాదంలో మరణించిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పరారయ్యారు.
పనజి: గోవా నైట్‌క్లబ్‌లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయిన గంటల్లోనే ఇండియా విడిచి పారిపోయిన లూథ్రా బ్రదర్స్ (Luthra Brothers) కోసం గాలింపు మొదలైంది. 'బిర్క్ బై రోమియా లేన్' యజమానులైన గౌరవ్ లూథ్రా, సౌరబ్ లూథ్రాలపై ఇంటర్‌పోల్ (Interpol) తాజాగా బ్లూకార్నర్ నోటీసులు (Blue corner notice) జారీ చేసింది. పరారీలో ఉన్న సోదరుల జాడను తెలుసుకునేందుకు గోవా పోలీసులు ఇంటర్‌పోల్ సాయం కోరడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి
పోలీసుల కథనం ప్రకారం, శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు టూరిస్టులతో సహా పలువురు అగ్నిప్రమాదంలో మరణించిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు పరారయ్యారు. డిసెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకు పుకెట్ (థాయిలాండ్) వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కినట్టు చెబుతున్నారు. కాగా, విచారణలో భాగంగా పోలీసులు లూథ్రా సోదరుల కోసం లూకౌట్ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలోని జీటీబీ నగర్ నివాసానికి ఒక టీమ్ వెళ్లింది. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో లూథ్రా సోదరుల సన్నిహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లూథ్రా బ్రదర్స్‌కు సన్నిహితుడు, మూడో పార్టనర్‌గా ఉన్న అజయ్ గుప్తా కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆచూకీ కూడా తెలియలేదు.
కాగా, మేనేజిమెంట్ టీమ్‌లో కీలకమైన ఆపరేషనల్ స్టాఫ్ మెంబర్ భరత్ కోహ్లిని పోలీసులు అరెస్టు చేశారు. క్లబ్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మోదక్, జనరల్ మేనేజర్ వివేక్ సింగ్, బార్ మేనేజర్ రాజీవ్ సంఘానియా, గేట్ మేనేజర్ రియాన్షు ఠాకూర్‌లను కూడా అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం గోవా పోలీసులు ఢిల్లీలోని లూథ్రా బ్రదర్స్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
జాతీయగీతం బెంగాల్‌కు పరిమితం కాదు.. ప్రియాంకకు అమిత్‌షా కౌంటర్
నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు.. సోనియా గాంధీకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి