IndiGo Crisis: ఇండిగోపై కఠిన చర్యలు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:07 PM
కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో సంక్షోభంపై మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. సంక్షోభానికి ఇండిగో విమానయాన సంస్థే జవాబుదారీగా ఉందని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయని తెలిపారు. భద్రత పూర్తిగా అమలులో ఉందని అన్నారు. సంక్షోభానికి ఇండిగో విమానయాన సంస్థే జవాబుదారీగా ఉందని స్పష్టం చేశారు. భారతదేశ విమానయాన రంగాన్ని ప్రయాణీకుల కేంద్రీకృతంగా మార్చడానికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు. ఇండిగో సంస్థ ప్రణాళికా వైఫల్యాలు, నిబంధనలను పాటించకపోవడం వల్లే ప్రయాణీకులకు ఇంత ఇబ్బంది కలిగిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా అన్ని ఇతర విమానయాన సంస్థలు సజావుగా నడుస్తున్నాయని అన్నారు. అన్ని విమానాశ్రయాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని, రద్దీ ఇబ్బందులు లేవని చెప్పారు. రీఫండ్, బ్యాగేజ్ ప్రయాణీకులకు అందజేయడం వంటి సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. డీజీసీఏ ఇండిగో సంస్థకు షో-కాజ్ నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపట్టిందని వెల్లడించారు. నివేదిక ఆధారంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
కొనసాగుతున్న విమాన సర్వీసుల రద్దు..
ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. నిత్యం వందకుపైగా విమాన సర్వీసులు రద్దు అవుతూనే ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 92 విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, గోవాలకు సంబంధించిన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
చియా లేదా హలీమ్ విత్తనాలు.. ఆరోగ్యానికి ఏది మంచిది?
దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందో తెలిస్తే...