Chia Vs Haleem Seeds: చియా లేదా హలీమ్ విత్తనాలు.. ఆరోగ్యానికి ఏది మంచిది?
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:02 PM
చియా లేదా హలీమ్ విత్తనాలు.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఇవి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: చియా, హలీమ్ విత్తనాలు రెండూ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ప్రతిరోజూ వీటిని తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ రెండింటిలో ఏది ఎక్కువ పోషకాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చియా విత్తనాలు
చియా గింజలు (Chia seeds) అనేవి సాల్వియా హిస్పానికా మొక్కకు చెందిన చిన్న, పోషకాలు నిండిన విత్తనాలు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి, చర్మానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. కానీ, అతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సరైన మోతాదులో తీసుకోవాలి. చియా గింజలను నీటిలో నానబెట్టినప్పుడు దానిలోని కరిగే ఫైబర్ నీటిలో జెల్‌ను ఏర్పరుస్తుంది. ఈ జెల్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. అంతేకాకుండా, శరీరం చెడు కొలెస్ట్రాల్‌ను నిర్మించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
హలీమ్ విత్తనాలు
హలీమ్ గింజల్లో కరిగే ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ మూడు శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను నిరోధించడంలో, కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో, కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. జుట్టు పెరుగుదల, రక్తహీనతను తగ్గించడం, ఎముకల ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత, జీర్ణక్రియ మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని పాలు, బెల్లంతో కలిపి లేదా ఇతర వంటకాల్లో ఉపయోగించవచ్చు.
ఏది మంచిది?
మీరు ఒమేగా-3, ఫైబర్ కోసం చూస్తున్నట్లయితే చియా మంచి ఎంపిక.
మీకు ప్రోటీన్, ఐరన్ అవసరమైతే, ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటే హలీం గింజలు ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి, మీ ఆరోగ్య లక్ష్యాలను బట్టి రెండింటినీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
(Note: ఇందులోని సమాచారం ఆరోగ్య నిపుణుల ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For MOre Latest News