Share News

Tirupati News: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందో తెలిస్తే...

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:42 PM

ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లా వాకాడు మండలంలో చోటుచేసుకుంది. ఈశ్వరయ్య అనే యుకుడు మహాలక్ష్మమ్మ దేవాలయం పక్కన ఉన్న గుంటలో ఈత కొట్టేందుకు దిగాడు. అక్కడే నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

Tirupati News: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందో తెలిస్తే...

- ఈతకెళ్లి యువకుడి మృతి

వాకాడు(తిరుపతి): ఈతకెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన మండలంలోని గొల్లపాళెం(Gollapalem)లో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గొల్లపాళెం గ్రామానికి చెందిన విన్నమాల ఈశ్వరయ్య(27) సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మహాలక్ష్మమ్మ దేవాలయం పక్కన ఉన్న గుంటలో ఈత కొట్టేందుకు దిగాడు. బయటకు రాకపోవడంతో స్థానికులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బాలిరెడ్డిపాళెం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


nani2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 09 , 2025 | 12:42 PM