Hero Darshan: మరోసారి వివాదంలోకి హీరో దర్శన్.. ఏం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:41 PM
హీరో దర్శన్ మళ్లీ.. వివాదంలో చిక్కుకున్నారు. పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆయన తోటి ఖైదీలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలొస్తున్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ కు సంబంధం ఉందన్న ఆరోపణలతో ఆయన ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు.
పరప్పన జైలులో ఖైదీలతో దర్శన్ వివాదం..
బ్యారెక్ వద్ద ఉద్రిక్తత
ప్రత్యేక నిఘా ఉంచిన అధికారులు
బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో పరప్పన అగ్రహార జైలులో ఉన్న నటుడు దర్శన్(Hero Darshan) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల తోటి ఖైదీలతో దర్శన్ వివాదం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దర్శన్ బ్యారెక్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోగా జైలు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పరప్పన జైలులో చోటు చేసుకుంటున్న సంఘటనలు అటు జైళ్ళ శాఖకు ఇటు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తుండటంతో కఠిన చర్యలు అమలులోకి తెచ్చారు.

గతంలో దర్శన్ జైలులోనే విలాసంగా కుర్చీలలో కూర్చొని టీ తాగుతున్న ఫోటోలు వైరల్ అయిన విషయం జైళ్ళశాఖకు తీరని సిగ్గుచేటు అనిపించేలా విమర్శలు వచ్చాయి. తాజాగా జైలులో ఉన్న ఓ ఉగ్రవాది మొబైల్ వాడకంతో పాటు కామాంధుడు ఉమేష్ బ్యారెక్‌లో మొబైల్‌లో మాట్లాడుతూ టీవీ చూసే వీడియోలు, ఫోటీలు ఏకంగా జాతీయ స్థాయిలో చర్చకు కారణ మయ్యాయి. ఢిల్లీలో కారుబాంబు పేలుడు దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ అధికారులు పరప్పన జైలుకు వచ్చి విచారణలు జరపడంతో జాతీయ స్థాయిలో జైలులో దిగజారుడు వ్యవహారాలు బహిరంగమయ్యాయి.

వీడియోలు, ఫొటోలు విడుదలకు దర్శన్‌కు చెందిన ఆప్తులే కారణమనే ఆరోపణల మేరకు పోలీసులు విచారణలు సాగిస్తున్నారు. ఇదే విషయంలోనే దర్శన్‌కు తోటి ఖైదీలకు వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. రేణుకాస్వామి హత్యకేసులో అనుకుమార్, జగ్గ, నాగరాజు, ప్రద్యూష్, లక్ష్మణ్‌లు ఒకే బ్యారెక్‌లో ఉన్నారు. నాగరాజు మినహా మిగిలిన వారు దర్శన్ వేధిస్తున్నారని ఇటీవల ఆరోపించారు. కొన్ని రోజుల కిందట దర్శన్ బ్యారెక్‌లో జగ్గ, దర్శన్‌ల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇదే జైలులో ఉంటే చనిపోతానని చిత్రదుర్గ జైలుకు మార్పు చేయాలని అనుకుమార్ జైళ్ళశాఖ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఇలా అన్ని విషయాలలోను దర్శన్ వివాదాల పాలవు తున్నారు. జైళ్లశాఖ సిబ్బంది దర్శన్ బ్యారెక్ వద్ద ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News