బాంబు బెదిరింపు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:46 PM
ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు.
అహ్మదాబాద్: కువైట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో (IndiGo) విమానాన్ని అహ్మదాబాద్ (Ahmedabad) విమానాశ్రంలో శుక్రవారంనాడు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానాన్ని హైజాక్ చేస్తున్నామని, బాంబు పెట్టామంటూ ఒక నోట్ విమానంలో కనిపించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం 6.40 గంటలకు విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరినీ విమానం నుంచి ఖాళీ చేయించి భద్రతా తనిఖీలు చేపట్టారు.
ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే తిరిగి విమానం బయలుదేరేందుకు అనుమతిస్తామని తెలిపారు.
ఇదే తరహా ఘటన
ఈనెల 22వ తేదీన కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ-పుణె ఇండిగో విమానం 6E 2608కు బాంబు బెదిరింపు రావడంతో పుణె విమానాశ్రయానికి రాగానే సురక్షిత ప్రాంతానికి తరలించారు. భద్రతా ఏజెన్సీలు క్షుణ్ణంగా పరిశీలించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు.
ఇవి కూడా చదవండి..
చరిత్ర సృష్టించనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన నివాళి
For More National News And Telugu News