ట్రాఫిక్ పోలీస్‌ని కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 30 , 2026 | 08:11 AM
వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారు డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నంలో ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టాడు. దాంతో కారు బానెట్‌పై కానిస్టేబుల్ పడ్డాడు. అది చూసి కూడా కారు ఆపకుండా అలాగే దాదాపు 500 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు డ్రైవర్.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని గ్రేటర్ నోయిడా(Greater Noida)లో షాకింగ్ సంఘటన జరిగింది. ఓ కారు.. ట్రాఫిక్ పోలీసు(Traffic Police)ను బానెట్ పై సుమారు 500 మీటర్ల వరకూ లాక్కొని పోయింది. డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణానికి పాల్పపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ట్రాఫిక్ కానిస్టేబుల్ గుర్మిత్ చౌదరి వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక ఎర్రటి కారును ఆపమని సిగ్నల్ ఇచ్చాడు. కానీ, ఆ డ్రైవర్ కారును ఆపడానికి బదులు వేగంగా వచ్చి కానిస్టేబుల్‌ను ఢీ కొట్టాడు. దాంతో కానిస్టేబుల్ కారు బానెట్‌పై పడిపోయాడు. డ్రైవర్ కారు ఆపకుండా దాదాపు 500 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. తర్వాత కారు ఆపి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ సంఘటన మొత్తం పక్కనే ఉన్న వ్యక్తి రికార్డ్ చేయగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ గుర్మీత్ చౌదరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు నిర్ధారించారు. డ్రైవర్ పై బీటా-2 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ సుధీర్ కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ సర్కార్ సాధించిందేమీలేదు.. ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ
ఫిబ్రవరిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రదేశాలు మిస్ అవ్వొద్దు..