ఫిబ్రవరిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రదేశాలు మిస్ అవ్వొద్దు..
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:31 PM
భారతదేశంలో సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రదేశాలు మీ ప్రయాణాన్ని మరపురాని అనుభవంగా మార్చేస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి నెల.. ప్రయాణాలకు అత్యంత అనుకూలమైన సమయం. ఆహ్లాదకరమైన వాతావరణం, సాంస్కృతిక ఉత్సవాలు, ప్రకృతి అందాలు కలిసి ఈ నెలను ప్రత్యేకంగా మారుస్తాయి. మీరు ఫిబ్రవరిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ 7 గమ్యస్థానాలు మీ ప్రయాణాన్ని మరపురాని అనుభవంగా మార్చేస్తాయి.
జైపూర్, రాజస్థాన్
ఫిబ్రవరిలో జైపూర్ కోటలు, రాజభవనాలు మరింత అందంగా కనిపిస్తాయి. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్, ఆర్ట్ వీక్ వంటి కార్యక్రమాలు నగరానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తాయి. రాజస్థాన్ సంప్రదాయ కళలు, హస్తకళలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

ఢిల్లీ..
ఫిబ్రవరిలో ఢిల్లీ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పాత ఢిల్లీ, లోధి గార్డెన్స్, మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు సందర్శించడానికి ఇది మంచి సమయం. ఇండియా ఆర్ట్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు ఈ నెలను మరింత ప్రత్యేకంగా చేస్తాయి.

వడోదర, గుజరాత్..
వడోదరలో వాతావరణం మంచిగా ఉంటుంది. పాత నగరం, మెట్ల బావులు, నది తీర ప్రాంతాలు సందర్శించవచ్చు. ఉత్తరాయణ పండుగ తర్వాత కూడా ఉత్సవ వాతావరణం కొనసాగుతుంది. సబర్మతి ఆశ్రమం వంటి చారిత్రక ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ముంబై, మహారాష్ట్ర..
ముంబైలో ఫిబ్రవరిలో అనేక కళా, సంగీత ఉత్సవాలు జరుగుతాయి. కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్, బ్లూస్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు నగరానికి ప్రత్యేక శోభను తీసుకొస్తాయి. గ్యాలరీలు, ఇరానీ కేఫ్‌లు కూడా సందర్శించవచ్చు.

ఒడిశా..
ఒడిశాలో కోణార్క్ నృత్య ఉత్సవం ప్రధాన ఆకర్షణ. చిలికా సరస్సులో వలస పక్షులను చూడవచ్చు. సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందం కలగలిసన రాష్ట్రం ఒడిశా.

ఖజురహో, మధ్యప్రదేశ్..
ఖజురహోలో యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాలు ప్రసిద్ధి. ఫిబ్రవరిలో జరిగే ఖజురహో నృత్య ఉత్సవం ప్రత్యేక ఆకర్షణ. ఆలయ పర్యటనలు, లైట్ అండ్ సౌండ్ షోలను ఆస్వాదించవచ్చు.

బెంగళూరు, కర్ణాటక..
ఫిబ్రవరిలో బెంగళూరు నగరం గులాబీ రంగు పూలతో అలంకరించినట్లు కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, నైట్ లైఫ్, కేఫ్‌లు, గ్యాలరీలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News