Share News

పాలు లేకుండా నెయ్యి తయారీ దుర్మార్గం

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:19 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

పాలు లేకుండా నెయ్యి తయారీ దుర్మార్గం
టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే కోట్ల

యాపదిన్నెలో గోపంచామృతంతో ఆలయం శుద్ధి

రచ్చబండలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, జనవరి 29(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. గురువారం మండ లంలోని యాపదిన్నె గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్ర మంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూ ప్రసాదాన్ని నాణ్యతతో లేకుండా కల్తీ నేయీ సరఫరా చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. సీబీఐ సిట్‌ కూడా ఈ విషయాన్ని బట్టబయలు చేసిందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంతో యాపదిన్నెలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం గోపంచామృతంతో శుద్ధి చేశామన్నారు.

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే కోట్ల: నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గనియా, జాయింట్‌ కలెక్టర్‌ బత్తుల కార్తీక్‌ను ఎమ్మెల్యే కోట్ల గురువారం నంద్యాలలోని కలెక్టర్‌ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు ఉపయోగపడే సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ: పట్టణంలోని వైఎస్‌ నగర్‌లో నివా సముంటున్న తగిలి శివ రంగనాథ్‌, హేమలత దంప తుల కుమారుడు అనారో గ్యంతో బాధపడుతుండగా.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే కోట్ల దంపతులు బాధి త కుటుంబ సభ్యులకు అందజేశారు.

టీడీపీలో చేరిక: ప్యాపిలి మండలం ఎస్‌.రంగాపురం గ్రామా నికి చెందిన 30 కుటుంబాలు ఎర్రగుంట్లపల్లి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే కోట్ల నివాసంలో ఆయన సమక్షంలో మరమేశి వరస్వామి, మరమేశి వసంత,మన్నెపు నాగరాజు, దేవగుంట వెంకటేశ, బండమీది హరి కృష్ణ, మరమేశి మల్లికార్జున, దేవగిరి శ్రీను, దేవగిరి వెంకట్రా ముడు తోపాటు మరో 30 కుటుంబాలు చేరాయి. ఈకార్యక్రమాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, లక్కసాగరం లక్ష్మీరెడ్డి, జిల్లా ఉపా ధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, మండల అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, దేవరబండ వెంకట నారాయణ గౌడు, భూమా నాగన్న, గుం డాల జయరాముడు, మల్లెంపల్లె జయన్న యాదవ్‌, ఎంపీడీవో వెంక టేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్‌ ఏఈ నారాయణ పాల్గొన్నారు.

.

Updated Date - Jan 30 , 2026 | 12:19 AM