పీటీ ఉష కుటుంబంలో విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత
ABN , Publish Date - Jan 30 , 2026 | 10:01 AM
భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
ఇంటర్నెట్ డెస్క్: రాజ్యసభ సభ్యురాలు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష(PT Usha) ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్(67) తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఉండగా శుక్రవారం తెల్లవారుజామున ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా. అప్పటికే మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు.
శ్రీనివాసన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు కబడ్డీ ప్లేయర్ అయిన శ్రీనివాసన్ 1991లో పీటీ ఉషను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి విఘ్నేష్ ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నారు. క్రీడా జీవితంలో ఆమె నడుపుతున్న ‘ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్’ అభివృద్ధిలో శ్రీనివాసన్ కీలకపాత్ర పోషించారు. శ్రీనివాసన్ ఆకస్మిక మృతిపై పలువురు క్రీడాకారులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
వామ్మో.. 65 ఏళ్లుగా ఒకే సంస్థలో మేనేజర్‌గా మహిళ! వైరల్ వీడియో!
2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టనుందా?