Share News

Om Birla on Women Empowerment: మహిళా సాధికారతపై ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:19 PM

మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సంప్రదాయమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఉద్ఘాటించారు. మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదని స్పష్టం చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటేనే మహిళా సాధికారత సాధించగలమని ఓంబిర్లా పేర్కొన్నారు.

Om Birla on Women Empowerment: మహిళా సాధికారతపై ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు
Om Birla on Women Empowerment

తిరుపతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సంప్రదాయమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) ఉద్ఘాటించారు. ఇవాళ(ఆదివారం) తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు (National Women Empowerment Conference) జరిగింది. ఈ సదస్సులో ఓం బిర్లా పాల్గొని మాట్లాడారు.

మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదని చెప్పుకొచ్చారు. మహిళల అభివృద్ధికి రాజ్యాంగం అనేక నిబంధనలు రూపొందించిందని గుర్తు చేశారు. మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదని స్పష్టం చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటేనే మహిళా సాధికారత సాధించగలమని ఓం బిర్లా పేర్కొన్నారు.


తిరుపతి సమీపం తిరుచానూరులోని ఒక ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా చట్టసభల మహిళా సాధికార కమిటీల తొలి జాతీయ సదస్సు ప్రారంభమైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతోంది. సాంకేతిక విప్లవంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే అజెండాగా ఈ సదస్సు జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

నవయువతకు ప్రేరణ.. అబ్బురపరుస్తున్న దుర్గేశ్‌ విన్యాసాలు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 14 , 2025 | 04:21 PM