Durgesh Magic Shows: నవయువతకు ప్రేరణ.. అబ్బురపరుస్తున్న దుర్గేశ్ విన్యాసాలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 08:27 AM
పాలకొల్లు పట్టణానికి చెందిన పప్పుల దుర్గామల్లేశ్వరరావు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ నడుపుతాడు.. బాణం వేస్తాడు.. అతని ప్రదర్శన చూస్తే కళ్లకు గంతలు కట్టినా చూస్తాడు అనిపిస్తుంది. అంత కచ్చితత్వంతో సాగే అతని ప్రదర్శన చూసేవారు ఊపిరి బిగబట్టాల్సిందే.
అబ్బురపరిచే దుర్గేశ్ ప్రదర్శనలు
పాలకొల్లు అర్బన్,సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కళ్లకు గంతలు కట్టుకుని బైక్ నడుపుతాడు.. బాణం వేస్తాడు.. అతని ప్రదర్శన చూస్తే కళ్లకు గంతలు కట్టినా చూస్తాడు అనిపిస్తుంది. అంత కచ్చితత్వంతో సాగే అతని ప్రదర్శన చూసేవారు ఊపిరి బిగబట్టాల్సిందే. పాలకొల్లు పట్టణానికి చెందిన పప్పుల దుర్గామల్లేశ్వరరావు (దుర్గేశ్) (Durgesh) విలువిద్య (ఆర్చరీ) కత్తిసాము, ఇంద్రజాల ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. అతని తండ్రి వెంకట్రావు, తల్లి పద్మావతి. ఆయన తండ్రి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితం.

అతనికి చిన్నతనంలోనే యాంకిలో జింగ్ స్పాండో లైటిస్ అనే వ్యాధి (ఎముకలు బిగుసుకుపోయే వ్యాధి) సోకింది. భరించలేని నొప్పితో జీవన సమ రం సాగించాడు. శరీరం సహకరించకున్నా ఇంద్రజాలంపై మక్కువ పెంచుకున్నాడు. కళ్లకు గంతలతో మోటార్ బైక్ నడుపుతాడు. బాణాలు సంధించి గురితప్పకుండా లక్ష్యాలను ఛేదిస్తాడు. డిగ్రీ అనంతరం సోషలిస్టు ఉద్యమ నేత జాన నాగేశ్వరరావు వద్ద శిష్యరికం చేసిన పలు రంగాల్లో రాణిస్తున్నారు.
సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటారు. నేత్రదానం, వ్యక్తిత్వ వికాసంపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు పలు పుస్తకాలను రచించాడు. హిందూత్వంపై ప్రచార ఉద్యమాన్ని చేపట్టి విజయవంతంగా సభలు నిర్వహించారు. తన వ్యాధి నివారణకు ఆయుర్వేద వైద్యం నేర్చుకు న్నారు. ‘ఆయుర్వేద జ్యోతి’ అనే మాస పత్రికను నిర్వహిస్తూ పలువురికి సూచనలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీలో అమానుషం.. బీ ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య
ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు
Read Latest Andhra Pradesh News and National News