B Pharmacy Student Case: ఏపీలో అమానుషం.. బీ ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:06 AM
నెల్లూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియని దారుణహత్యకు గురైంది. ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ.
నెల్లూరు, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): నెల్లూరులో (Nellore) అమానుష ఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ (Maidhili Priya) దారుణ హత్యకు గురైంది. ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ. ఆమెతో మాట్లాడాలని రూమ్‌కి పిలిచి, కత్తితో పొడిచి చంపేశాడు స్నేహితుడు నిఖిల్ (Nikhil).
అయితే, మైధిలిప్రియ ప్రేమకు నిరాకరించినందుకే నిందితుడు హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. యువతిని హత్యచేసిన అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు నిందితుడు నిఖిల్. మైధిలిప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కి తరలించారు పోలీసులు. మైధిలిప్రియ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు
Read Latest Andhra Pradesh News and National News