నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు
ABN , Publish Date - Feb 04 , 2026 | 01:52 PM
రాష్ట్రంలో మరికొద్ది రోజేల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు.
అన్నాసమాధి వద్ద శశికళ ప్రకటన
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన నేతృత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని, అప్పటి నుంచి రాష్ట్రంలో ‘అమ్మ పాలన’ మళ్లీ ఆరంభమవుతుందని మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ(Shashikala) వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం మెరీనాబీచ్‌లో మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై సమాధి వద్ద తన అనుచరులతో కలిసి నివాళులర్పించారు.
ఆ సందర్భంగా ఆమె అనుచరులంతా ‘ద్రోహులను, శత్రువులను ఓడించి శశికళ నాయకత్వంలో అధికారంలోకి వస్తాం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న విలేఖరులు శశికళ దగ్గరకు వెళ్ళి సొంత పార్టీ పెట్టబోతున్నారా? అని ప్రశ్నించగా, తమ శత్రువులు ఎవరో, ద్రోహులు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన నేతృత్వంలో అమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని,
అది ఎలా జరుగనుందో త్వరలోనే అందరూ చూస్తారని నర్మగర్భంగా బదులిచ్చారు. అన్నాడీఎంకే అవినీతి పార్టీ అని టీవీకే నేత విజయ్ విమర్శించడం గర్హనీయమన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే పాలన ఎలా సాగిందో ప్రజలందరికీ తెలుసునని, ప్రస్తుతం ప్రజలంతా మళ్ళీ ‘అమ్మ పాలన’ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారని శశికళ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
థియేటర్లపై.. సినిమాల దండయాత్ర! తెలుగులోనే డజన్.. ఎలా చూడాల్రా నాయనా
Read Latest Telangana News and National News