భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్..
ABN , Publish Date - Feb 16 , 2026 | 09:27 AM
ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది.
ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల ఛేజింగ్‌లో పాక్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. ఈ పరాజయం పాక్ నేతలు, క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపింది. ఈ నేపథ్యంలో ప్రేమదాస స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది (India vs Pakistan T20 World Cup).
ఈ మ్యాచ్ చూసేందుకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు పాకిస్థాన్ మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరయ్యారు. గ్యాలరీ నుంచి చాలా సేపు మ్యాచ్ వీక్షించారు. అయితే ఛేజింగ్‌లో పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోవడంతో నిరాశకు లోనయ్యారు. పాక్ పరాజయం తప్పదని తెలియడంతో మ్యాచ్ పూర్తి కాకముందే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ముందుగా ప్రతిపాదించింది నఖ్వీ అనే సంగతి తెలిసిందే (Mohsin Naqvi stadium exit).
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే స్టేడియంలో నఖ్వీ ఓవరాక్షన్ చేద్దామనుకున్నాడని (India thrash Pakistan), అయితే టీమిండియా దెబ్బకు ముందుగానే స్టేడియం నుంచి పారిపోవాల్సి వచ్చిందని భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ పరాజయంతో పాక్ జట్టుపై ఆ దేశ క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు ఎప్పటికీ టీమిండియాను ఓడించలేదని కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా చేతిలో ఓడిపోవడం పాక్‌కు అలవాటుగా మారిందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాకు ఏపీ సీఎం అభినందనలు..