భారత్ vs పాకిస్థాన్, టాస్ గెలిచిన పాకిస్థాన్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:46 PM
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్‌లోనే అత్యంత రసవత్తర మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవబోతోంది. దాయాదుల పోరును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ సూపర్ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది.
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్‌లోనే అత్యంత రసవత్తర మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవబోతోంది. దాయాదుల పోరును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ సూపర్ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రేక్షకులు స్టేడియంకు చేరుకున్నారు (Ind vs Pak).
టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు (India match update). దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలుస్తుందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆకాశం మబ్బులు వీడి ప్రశాంతంగా ఉంది. దీంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌కు సంజూ శాంసన్, అర్ష్‌దీప్ దూరమయ్యారు. అభిషేక్ శర్మ, కుల్‌దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు .
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
పాకిస్థాన్: సయామ్ ఆయుబ్, ఫర్హాన్, సల్మాన్ అఘా, బాబర్ అజామ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, ఉస్మాన్ ఖాన్, షహీన్ అఫ్రీది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్