Share News

భారత్ vs పాకిస్థాన్, ఈ సారి కూడా షేక్‌హ్యాండ్ లేదు..

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:08 PM

ప్రస్తుత టీ-20 ప్రపంచకప్‌లోనే అత్యంత రసవత్తర మ్యాచ్‌ కొలంబోలో మొదలైంది. భారత్, పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్‌కు వేదిక అయిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు వేలాది మంది ప్రేక్షకులు చేరుకున్నారు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు

భారత్ vs పాకిస్థాన్, ఈ సారి కూడా షేక్‌హ్యాండ్ లేదు..
No handshake India Pakistan

ప్రస్తుత టీ-20 ప్రపంచకప్‌లోనే అత్యంత రసవత్తర మ్యాచ్‌ కొలంబోలో మొదలైంది. భారత్, పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్‌కు వేదిక అయిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు వేలాది మంది ప్రేక్షకులు చేరుకున్నారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు (India match update). దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది (India vs Pakistan).


తాజా మ్యాచ్ టాస్ సమయంలో కూడా భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా షేక్‌హ్యాండ్ చేసుకోలేదు. టాస్ సమయంలో ఇద్దరూ దూరంగానే ఉండిపోయారు. ఆసియా కప్ సందర్భంగా ఆడిన మ్యాచ్‌ల్లో కూడా భారత్, పాక్ ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. అది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. తాజాగా కూడా అదే సీన్ రిపీట్ అయింది (no handshake India Pakistan).


ఇక, ఈ మ్యాచ్ ఆడేందుకు పాక్ చాలా హైడ్రామా క్రియేట్ చేసింది (India Pakistan tensions). భారత్‌‌తో టీ-20 మ్యాచ్ ఆడేది లేదని పాకిస్థాన్ ప్రధాని, పీసీబీ అధ్యక్షుడు భీష్మించుకుని కూర్చున్నారు. అయితే ఐసీసీ వార్నింగ్, శ్రీలంక క్రికెట్ బోర్డ్ విజ్ఞప్తి కారణంగా పాక్ దిగి వచ్చింది. దీంతో ఈ రోజు కొలంబోలో మ్యాచ్ జరుగుతోంది.

Updated Date - Feb 15 , 2026 | 07:11 PM