తీవ్ర విషాదం.. బైకులు ఢీకొని ఇద్దరి మృతి
ABN , Publish Date - Feb 16 , 2026 | 08:18 AM
ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. రెండు ద్విచక్రవాహనాలు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే..
తిరుపతి: పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా(Chittoor District) చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతులను బోడిగుట్టపల్లికి చెందిన భూపాల్ రెడ్డి (28), యల్లంపల్లికి చెందిన మల్లికార్జున్(24) గా గుర్తించారు. మల్లికార్జున్ ప్రమాద స్థలంలోనే మృతిచెందగా.. చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే భూపాల్ రెడ్డి మృతిచెందాడు.
మృతదేహాలను తిరుపతి రుయా మార్చురీకి తరలించారు పోలీసులు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చంద్రగిరి ఎస్సై ప్రవల్లిక తెలిపారు. మహా శివరాత్రి పండుగ పూట ఇలాంటి సంఘటన జరగడంతో ఇరు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..
రాజమండ్రిలో పెద్ద పులి భయం.. ఫారెస్ట్ బృందం చర్యలు
Read Latest Telangana News And AP News And Telugu News