ఢిల్లీలో 'సేవా తీర్థ్' ప్రారంభం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు..
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:43 PM
దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన 'సేవా తీర్థ్' (ప్రధానమంత్రి కార్యాలయం), సెంట్రల్ సెక్రటేరియెట్ (కర్తవ్య భవన్) భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా తన సందేశంలో 'సేవా తీర్థ్' ప్రాముఖ్యతను కొనియాడారు..
అమరావతి: ఢిల్లీలో నూతనంగా నిర్మించిన సేవా తీర్థ్(ప్రధానమంత్రి కార్యాలయం), సెంట్రల్ సెక్రటేరియెట్(కర్తవ్య భవన్) భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఇక నూతన కార్యాలయంలో తొలి రోజున ప్రధాని ఓ కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు పీఎం-రాహత్ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’(ట్విట్టర్) వేదికగా ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి తన అభినందనలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి తన సందేశంలో ‘సేవా తీర్థ్’ ప్రాముఖ్యతను కొనియాడారు. సేవా తీర్థ్.. భారతదేశ పరిపాలనా పాలనా నిర్మాణంలో ఒక మైలురాయి. వలసరాజ్యాల గతం నుండి నిర్ణయాత్మకమైన అడుగు దూరంలో ఉంది. 2047 వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా, ఆధునిక, సమర్థవంతమైన పాలనా వ్యవస్థను నిర్మించడానికి ఉపకరిస్తుంది. ఇది ప్రధాని అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం.. రాష్ట్ర అభివృద్దికి ఎంతో అవసరం అని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదు.. జగన్ అండ్ కోపై లోకేశ్ ధ్వజం
జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర
Read Latest Telangana News And AP News And Telugu News