Mamata Banerjee: దుశ్శాసనుడు వచ్చారు.. అమిత్‌షాపై విరుచుకుపడిన మమత
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:35 PM
పధ్నాలుగేళ్ల క్రితం ప్రజలు భయంగుప్పిట్లో ఉన్నప్పుడు తాము బంకురలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, నీటిసంక్షోభాన్ని అధిగమించేందుకు ఎంతో చేశామని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీని తప్పుపట్టారు.
కోల్‌కతా: టీఎంసీ పాలనలో హింస, అవినీతి రాజ్యమేలాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'దుశ్శాసనుడు బెంగాల్ వచ్చారు' అంటూ పరోక్షంగా అమిత్‌షాపై ప్రతి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోయిందని అమిత్‌షా చేసిన ఆరోపణలను సైతం ఖండించారు.
బీజేపీ నేతలను మహాభారతంలోని పాత్రలైన దుర్యోధన, దుశ్శాసనులతో మమతా బెనర్జీ పోల్చారు. 'బెంగాల్‌కు ఒక దుశ్శాసనడు వచ్చారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ దుశ్శాసన, దుర్యోధనులు కనిపించడం మొదలవుతుంది. సమాచార సేకరణ కోసం దుశ్శాసనుడు వచ్చారు. పెన్సింగ్ కోసం మమతా బెనర్జీ భూములివ్వలేదని ఇవాళ వాళ్లు చెబుతున్నారు. నేను భూములు ఇవ్వకపోతే ఏమి జరిగి ఉండేది? పేట్రాపోల్‌లో భూములు ఇచ్చింది ఎవరు? ఆండాల్‌లో భూములు ఎవరిచ్చారు?' అని మంగళవారంనాడిక్కడ జరిగిన బహిరంగ సభలో మమతాబెనర్జీ ప్రశ్నించారు. పధ్నాలుగేళ్ల క్రితం ప్రజలు భయంగుప్పిట్లో ఉన్నప్పుడు తాము బంకురలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, నీటిసంక్షోభాన్ని అధిగమించేందుకు ఎంతో చేశామని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీని తప్పుపట్టారు.
అమిత్‌షా ఏమన్నారు?
బెంగాల్ సరిహద్దుల వెంబడి చొరబాట్ల సమస్య కేవలం రాష్ట్ర సమస్య కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. జాతి సంస్కృతి, భద్రతను పరిరక్షించాలంటే బెంగాల్ సరిహద్దులను సీల్ చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆ పని టీఎంసీ వల్ల కాదని, బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. సరిహద్దు కంచెకు బెంగాల్ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే తొలుత బెంగాల్‌లో చొరబాటుదార్ల ప్రవేశం జరిగిందని ఆరోపించారు. ఓటు బ్యాంకును విస్తరించుకునేందుకే బెంగాల్ డెమోగ్రఫీలో మార్పులను మమత కోరుకున్నారని తప్పుప్టటారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
నేషనల్ గ్రిడ్‌తో చొరబాటుదారుల ఆటకట్టు.. ఆమిత్‌షా
ఏం డౌట్ వద్దు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి