Aviva Baig Profile: ప్రియాంక గాంధీ కోడలిగా అవివా బేగ్.. అసలెవరీ అవివా బేగ్?
ABN , Publish Date - Dec 30 , 2025 | 03:23 PM
గాంధీ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ-రాబర్ట్ వాద్రాల కుమారుడు రెహాన్ వాద్రా, తన ప్రియురాలు అవివా బేగ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. అయితే, అసలెవరీ అవివా బేగ్? ప్రియాంక గాంధీ కాబోయే కోడలి ప్రొఫైల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోనే ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో ఒకటైన గాంధీ-వాద్రా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ-రాబర్ట్ వాద్రాల కుమారుడు రెహాన్ వాద్రా, తన ప్రేయసి అవివా బేగ్ పెళ్లి బంధంతో ఒకటికానున్నారు. వీరిద్దరికీ ఇటీవల నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. అయితే, అసలెవరీ అవివా బేగ్? ప్రియాంక గాంధీ కాబోయే కోడలి ప్రొఫైల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అవివా బేగ్ ఎవరు?
అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్ అంతేకాకుండా మంచి ఆర్టిస్ట్ కూడా.. ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో ఆమె చదువుకున్నారు. ఆ తర్వాత, హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుండి జర్నలిజం, కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనం నుండి కళలపై ఉన్న ఆసక్తితో, అవివా ఫోటోగ్రఫీని తన కెరీర్‌గా ఎంచుకుంది.

అవివా బేగ్ ప్రస్తుతం Atelier 11 అనే ఫోటోగ్రఫీ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీకి కో-ఫౌండర్‌గా పనిచేస్తోంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ బ్రాండ్లతో కలిసి పని చేస్తోంది. అవివా తీసిన ఫోటోలు వాణిజ్య పరంగానే కాక, కళాత్మక విలువలను కూడా కలిగి ఉండటంతో, జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లలో ప్రదర్శించబడ్డాయి. అవివా బేగ్ ఒకప్పుడు జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ప్లేయర్ కావడం విశేషం.
వాద్రా కుటుంబంతో అనుబంధం
రెహాన్ వాద్రా, అవివా బేగ్ కుటుంబాల మధ్య చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. అవివా బేగ్ తండ్రి ఇమ్రాన్ బేగ్ ప్రముఖ వ్యాపారవేత్తగా, ఆమె తల్లి నందిత బేగ్ ప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. నందిత బేగ్ ఇందిరా భవన్ ఇంటీరియర్ పనుల్లో కీలక పాత్ర పోషించారు. ఈ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం వల్లనే రెహాన్ వాద్రా, అవివా బేగ్ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.

రెహాన్-అవివా ప్రేమ కథ
రెహాన్ వాద్రా, అవివా బేగ్ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. వీరిద్దరికీ కళలపై ఆసక్తి ఎక్కువ. రెహాన్ కూడా ఒక అద్భుతమైన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్. ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. 2026లో రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరగనున్నట్లు సమాచారం. గాంధీ కుటుంబంలో ఆర్టిస్టు కోడలిగా అవివా బేగ్ అడుగుపెట్టబోతుండటంతో ఈ వివాహం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
Also Read:
రూ.100 కోట్ల విరాళం..గొప్ప మనసు చాటుకున్న విద్యార్థులు
వాటి కోసం ఒక యుద్దమే చేశాం: సీపీ రాజశేఖర్ బాబు
For More Latest News