Home » Mamata Banerjee
ఫ్రీజ్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను తిరిగి నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ ఖాతాల్లో రూ.804 కోట్ల నిధులున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై కొనసాగుతున్న వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాలు తమ వాదనలు, అఫిడవిట్లు సమర్పించేందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడానికే ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్వహించిందని మాజీ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా నుంచి ఓటర్లను తొలగించారని ఆమె అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా శీరాంపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ వాహనంపై కొందరు వ్యక్తులు కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ ఉప ఎన్నికలో టీఎంసీ తరఫు నుంచి బరిలోకి దిగిన సంచిత పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
త్వరలో నందీగ్రామ్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
పశ్చిమ్ బెంగాల్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎంసీలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ ఆ పార్టీని రెండు వర్గాలుగా విభిజించి.. విడిగా పేర్లు, గుర్తులను కేటాయించింది.
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ(28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్‌హట్‌లోని తమ నివాసంలో మంగళవారం ఉరి వేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సోదరుడి కుమార్తె, 28 ఏళ్ల బృష్టి ముఖర్జీ మృతి చెందారు. కుసుంబా గ్రామంలో ఉన్న నివాసంలో ఆమె అనుమానాస్పద స్థితిలో ప్రాణాలొదిలారు.
తృణమూల్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కోల్‌కతా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ కోల్‌కోతా పోలీసులు శనివారం సుమోటాగా మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.