Share News

ఎస్ఐఆర్‌‌ వెతలతో కవితా సంపుటి.. మమతా బెనర్జీ

ABN , Publish Date - Jan 22 , 2026 | 08:30 PM

ఎస్ఐఆర్‌ కారణంగా ప్రజలు పడిన ఇబ్బందులు, ఆవేదనలతో కూడిన 26 కవితల సంపుటితో తన 162వ పుస్తకాన్ని ఇదే బుక్ ఫెస్టివల్‌లో విడుదల చేయనున్నట్టు మమతా బెనర్జీ తెలిపారు.

ఎస్ఐఆర్‌‌ వెతలతో కవితా సంపుటి.. మమతా బెనర్జీ
Mamata Banerjee

కోల్‌కతా: ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో ఒత్తిళ్లు, భయందోళనల కారణంగా రాష్ట్రంలో సుమారు 110 మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. ఇంటిపేర్ల వివరాల్లో తేడాలు, జనన ధ్రువీకరణ పత్రాల కోసం పట్టుబట్టడం వంటివి ఈ భయాందోళనలు కారణమైనట్టు చెప్పారు. ఎస్ఐఆర్‌ కారణంగా ప్రజలు పడిన ఇబ్బందులు, ఆవేదనలతో కూడిన 26 కవితల సంపుటితో తన 162వ పుస్తకాన్ని ఇదే బుక్ ఫెస్టివల్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. 49వ అంతర్జాతీయ కోల్‌కాతా బుక్ ఫెయిర్‌ను సీఎం గురువారంనాడిక్కడ ప్రారంభించారు.


స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) క్యాంపుల వద్ద విచారణ కోసం వృద్ధులతో సహితంగా వేలాది మంది ప్రజలు ప్రతి రోజూ ఐదారు గంటలు క్యూలల్లో వేచిచూడాల్సి వచ్చేదని మమతా బెనర్జీ తెలిపారు. బెంగాలీల ఇంటిపేర్లలో వైరుధ్యాలు ఉన్న అంశాన్ని ప్రధానంగా ఈసీ లేవెనత్తడంపై ఆమె విమర్శలు గుప్పించారు. ఏళ్ల తరబడి ఇది ఆమోదానికి నోచుకుందని చెప్పారు. మమతా బెనర్జీ గానూ, మమతా బందోపాధ్యాయ్‌‌గానూ తాను అందరికీ తెలుసునని, అదే విధంగా ఛటర్జీ, ఛటోపాధ్యాయ్ అన్నవి ఒకే ఇంటిపేర్లని, ఠాకూర్‌ను ఠాగోర్ అని బ్రిటిష్ హయాంలో పిలిచే వారని చెప్పారు. విశ్వకవి రబీంద్రనాథ్ ఠాకూర్ బతికుంటే ఆయన కూడా ఇప్పుడు ఇదే సమస్య ఎదుర్కోవలసి వచ్చేదని అన్నారు. ఎక్కువ మంది పిల్లలుంటే వయస్సులో వ్యత్యాసానికి కారణం చెప్పాలని ప్రశ్నించడం, వృద్ధులను జనన ధ్రువీకరణ పత్రాల కోసం పట్టుబట్టడం వంటివి ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రధానంగా ప్రజలను ఆందోళనకు గురిచేసినట్టు చెప్పారు.


'మన తల్లులు వాళ్లెప్పుడు పుట్టారో కచ్చితమైన తేదీని మనకు చెప్పలేరు. మాజీ ప్రధాని వాజ్‌పేయి సైతం డిసెంబర్ 25 తన నిజమైన పుట్టినరోజు కాదని నాతో అన్నారు. నా వద్ద మాధ్యమిక్ (క్లాస్ 10 స్టేట్ బోర్డ్ ఎగ్జామ్) పేపర్లలో నేను పుట్టిన కచ్చితమైన తేదీ ఉంది. కానీ దీనికి ముందు తరాల వారికి వద్ద అవి ఉండకపోవచ్చు. అలాంటి వారిని వేధించడం ఎందుకు?' అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ముంబై మేయర్ పదవి మహిళకే.. లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ శివసేన అభ్యంతరం

క్రొయేషియాలో భారత ఎంబసీపై దాడి.. ఎంఈఏ తీవ్ర అభ్యంతరం

Read Latest National News

Updated Date - Jan 22 , 2026 | 08:35 PM